పుట:SamskrutaNayamulu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
69

సంస్కృతన్యాయములు

కుక్క నింత భద్రముగాఁ గొనిపోవుచున్నా రేల?" అని ప్రశ్నించెను. "కుక్క గాదు, ఇది మేక" అని భైరవుఁడు తనదారి పట్టెను. సమీపమున రెండవవాఁడు నట్లే యనెను. భైరవునకుఁ గొంచె మనుమానము కలిగెను. కాని, తలవంచి విచారించుచు పోవుచుండెను. మూఁడవవాఁడు నట్లే యనెను. భైరవున కనుమానము ప్రబలి తుద కది కుక్క యనియే విశ్వసించి మేక నచట విడిచిపోయెను. దొంగలు తమపని చూచుకొనిరి. కావున-

నలుగు రేది పలికిన నదియే సిద్ధాంత మవును.

"పదుగురాడుమాట పాటియై ధరఁ జెల్లు" (వేమన.)

భర్చున్యాయమును జూడుము.

భౌతవిచారన్యాయము :

పిచ్చివాని ఆలోచనవలె. పిచ్చివాఁ డొకఁడు రాజమందిరమునకుఁ బోయెను. సింహద్వారమున నొకమదపుటేనుఁగు నిలఁబడియుండెను. దానిని చూచి యాతఁ డీతీరునఁ దలపోసెను- "ఏమిది? చీఁకటియా? కాదు, కాదు. చీఁకటి చేటలతో బయలు దేరునా? కాకున్న? మేఘము కావచ్చును. ధారగా నీరు క్రుమ్మరించుచున్నది; గర్జిల్లుచున్నది. అబ్బే! అదీ కాదు. మేఘమునకు నలువైపుల నాలుగు స్తంభము