పుట:SamskrutaNayamulu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

సంస్కృతన్యాయములు

ప్రవత్స్యద్భర్తృకాన్యాయము
  • భర్తదూరదేశమునకుఁ బ్రయాణమగుచుఁడ నాతని యెదుటనె భార్య యేడ్చినట్లు.
ప్రసక్తానుప్రసక్తన్యాయము
  • ఒకపని సాధింపఁ బూనుకొనిన మఱియొకఫలముగూడ గలిగినట్లు.
ప్రసూతివైరాగ్యన్యాయము
  • ప్రసవసమయమున నెప్పులకోర్వలేక ఇఁక మగనిపొత్తు ప్రమాదముననైనఁ గోర నని వైరాగ్యమునొందిన వనిత అది తీరినవెనుక మఱల మామూలు వ్యవహారమునకు గడఁగినట్లు.
  • శ్మశాన, పురాణవైరాగ్యముల విధమున.
ప్రాసాదవాసిన్యాయము
  • మేడలో ఉన్నవారనిన, వారు రేయింబవళ్లు మేడమీఁదనే ఉండరు; క్రిందకూడ ఉందురు.
ప్లవంగగతిన్యాయము
  • కోతిగంతు లట్లు.
ఫలవత్సహకారన్యాయము
  • పండ్లకొఱకుఁ బెరటిలో నాటఁబడిన తీయమామిడి చెట్టు పండ్లేగాక నీడను, మంచిసువాసనను అడుగకయే ఇచ్చును.