పుట:SamskrutaNayamulu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

53

సంస్కృతన్యాయములు

పితాపుత్రన్యాయము
  • ప్రస్తుతము తాను తండ్రియైనను, మున్నొకనికి కొడుకయి యున్నాడు.
పిపీలికాన్నాయము
  • చీమ పండునకై చెట్టుమొదటినుండి మెల్లగ జివర వఱకు బ్రాకి పండునకు కన్నము వైచి లోనిరసము నానునట్లు.
  • ఓపికపట్టి సాధించిన మెల్లగ బనులన్నియు సమకూరును.
పిపీలికాభి ర్మంథానగిరివిలేపనన్యాయము
  • చీమలతో మందర పర్వము చుట్టు పూతపూసినారట.

నమ్మరానిమాటలు అని భావము.

పిపీలికాపన్నగన్యాయము
  • "చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్లు."

సుమతీశతకము.

పిష్టపేషణన్యాయము
  • విసిరినపిండినే మఱలమఱల విసిరినట్లు.

ఊషరవృష్టివలె నిరర్ధకము అనిభావము.
విసరిననే పిండి యనుపేరు వచ్చును. ఇక బిండిని విస
రుటయన ? అట్లే బియ్యము వండిన అన్నము అగును.
అన్నమును వండుము అనిన ? పిండిని అనిన దదుపకరణ
మును, అన్నమును అనిన బియ్యము అనియు అర్థము
స్ఫురించును.