పుట:SamskrutaNayamulu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఈ పుట ఆమోదించబడ్డది


48

సంస్కృతన్యాయములు

(అట్లే ఉన్నతపదచ్యుతుడయినవానుడు.)

  • వృక్షాగ్రమునుండి జారిన పండు క్రమముగ కొమ్మలను దాటి నేల పై బడినట్లు.
పంజరచాలనన్యాయము
  • పంజరముననున్న పక్షులన్నియు నొకమాటగ ముక్కులతో బొడిచిన పంజరము పగిలి పక్షు లన్నియు లేచి పోగలవు.
వంజరబకన్యాయము
  • పంజరములో పెట్టి పోషించినను కొంగ చిలుకవలె మాటాడదు.

బక బంధనన్యాయమువలె.

పంజరము క్తవిహంగోడ్డీసన్యాయము
  • పంజరమునుండి పక్షిని వదలిన సది ఆకసమున కెగురును.
  • దీనినే పంజరముక్త పక్షిచాలసన్యాయము అనియు నందురు.
పంజరస్థసింహన్యాయము
  • పంజరములో (బంధింపబడి) నున్న సింహమువలె.
పటకుటీరన్యాయము
  • డేరా వలసినతావున నిల్లుగా నేర్పడును.
పటతంతున్యాయము
  • వస్త్రమంతయు నూలుతో నిండియుండును. వస్త్రము నేయకపూర్వము నూలే; నేసినవస్త్రమును విడదీసినపుడును