పుట:SamskrutaNayamulu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

47

సంస్కృతన్యాయములు

నౌనావికాన్యాయము
  • నావికుఁడు లేకుండ నావ నడువదు; నావ లేకున్న నావికుఁ డనవసరము.
నౌశకటన్యాయము
  • ఓడలు బండ్లు కావచ్చు. బండ్లోడలు కావచ్చు.

ప్రభ. 1.94.

న్యగ్రోధబీజన్యాయము
  • మఱ్ఱిచెట్టువిత్తనము చిన్నదైనను దానినుండి పుట్టిన వృక్షము విపరీతముగ విస్తరించును.
  • "విత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంత?" - వేమన.
  • (పిట్ట కొంచెం; కూత ఘనం.)
పంకప్రక్షాళనన్యాయము
  • అడుసు త్రొక్కనేల ? కాలు కడుగనేల ?
పంకమగ్నగజన్యాయము
  • ఱొంపిలో బడిన యేనుగు నేనుగే లేవనెత్తవలెను.

" ఏనుగు పల్లసంబిడిన నేలికకున్ వశమే వహింపగన్" విక్ర. 5.132

పంచకోశావతరణన్యాయము
  • వరుసగ ఆనందమయకోశము మొదలు అన్నమయకోశము వఱకును గల పంచకోశములను బొంది తుదకు జీవాత్మ దేహి యవును.