పుట:SamskrutaNayamulu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

45

సంస్కృతన్యాయములు

నిమ్నగాప్రవాహన్యాయము
  • ఏటిలో కొట్టుకొనిపోవు చీమలు మొదలగునవి ఒకసుడిలో నుండి తప్పించుకొనినను వెంటనే వేరొకసుడిలో పడును.
నిర్ధనమనోరథన్యాయము
  • దరిద్రునకు కోరిక లెక్కువ.
  • "ఉత్పద్యన్తే విలీయన్తే దరిద్రాణాం మనోరథాః
  • బాలవైధవ్యదగ్ధానాం కులస్త్రీణాం కుచావివ."
నిర్వ్యాపారాంబష్టన్యాయము
  • పనిలేనిమంగలి పిల్లితల గొఱిగి నట్లు.
నివాతస్థదీపన్యాయము
  • గాలిలేనిచోట (అచంచలముగ) నున్న దీపమువలె.
  • "నివాతస్థో యథా దీపః" - భగవద్గీత.
నిషాదస్థపతిన్యాయము
  • నిషాదుని రాజుగా నియమించినట్లు.
నీరనీరన్యాయము
  • నీరును నీరును గలిసిన విడఁదీయుట అసంభము.
నీరక్షీరన్యాయము
  • నీరు, పాలు కలిసిన గుర్తించుట కష్టతరము.
నీలేందీవరన్యాయము
  • ఇందీవరమన నల్లకలువ. అయినను నీలేందీవర మందురు .