పుట:SamskrutaNayamulu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

సంస్కృతన్యాయములు

నసిప్రోతబలీవర్దన్యాయము
  • ఎద్దుకు ముకుద్రాళ్ళు కట్టినట్లు.
నాంతరీయకన్యాయము
  • వలసినయంతవఱకే అర్థము గ్రహింపవలెను.
  • (వడ్లు దంపి తినుటకు బియ్యమే గ్రహించినట్లు.)
నానావృక్షరసన్యాయము
  • అనేకవృక్షములలో నుండు రస మావృక్షములకంటె భిన్నమైయుండును.
నారికేళతృణన్యాయము
  • కొబ్బరిచెట్టు నెందుల కెక్కెదవనిన దూడ గడ్డికొఱకు అనినట్లు.
నారికేళాంబున్యాయము
  • కొబ్బరికాయలోనికి నీ రెట్లు వచ్చినదో ఎవరికీనీ దెలియదు.

"సిరితా వచ్చిన వచ్చును, సరభసముగ నారికేళ సలిలముభంగిన్‌" (సుమతిశతకము.)

నాసికాంగుళీన్యాయము
  • ఎవరిముక్కురంధ్రములో వారివ్రేళ్లేవైనఁ బట్టును.
నాసిప్రోతోష్ట్రన్యాయము
  • ముకుద్రాఁడువైచిన ఒంటె మాదిరి.
  • నసిప్రోతబలీవర్దన్యాయము మాదిరి.