పుట:SamskrutaNayamulu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

43

సంస్కృతన్యాయములు

నటాంగనాన్యాయము
  • ఆడువేషము వేసినస్త్రీ ఆయాసహచరుల కందఱికిని భార్య అయినట్లు
  • (ఆకాశముమీద నెగురు విమానము ఎవరిమటుకు వారి నెత్తికి సూటిగనే ఉన్నట్లు కన్పడును.)
నదీసముద్రన్యాయము
  • నదులన్నియు సముద్రములోనే కలియును.
  • "నదీనాం సాగరో గతిః" అనునట్లు.
  • నదులన్నియు సముద్రములో కలిసి సముద్రరూపమేయైనను నదియు సముద్రమును పరస్పరము భిన్నములే. *ఉదా:- జీవేశ్వరులు.
  • నదులు సముద్రములో కలిసి తమనామరూపములే లేకుండ పోవును.
  • ఉదా:- అఖండపరబ్రహ్మమందు జీవేశ్వరులట్లు.
నద్యంబువేగన్యాయము
  • నదులు తీవ్రగతితో ప్రవహించి సముద్రములో కలిసి పోవునట్లు.
నష్టాశ్వదగ్ధరథన్యాయము
  • యుద్ధములో నొకనికి గుఱ్ఱము చచ్చెను. ఇంకొకనికి రథము కాలిపోయెను. ఇరువురును గలిసినచో రథికులయ్యెద రనునట్లు.