పుట:SamskrutaNayamulu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

సంస్కృతన్యాయములు

దేహాథోముఖత్వన్యాయము
  • పాంచభౌతికమవు దేహము నాశ్రయించి ఆత్మ అథోముఖ గతిని పొందును; దేహసంబంధము పోయినయంతన ఊర్థ్వముఖగతి నొందును.
ద్రవిడప్రాణాయామన్యాయము
  • ద్రవిడులు ప్రాణాయామము చేయునపుడు చేతితో తల చుట్టిముక్కు పట్టుకొందురట.
  • అనగా తేలికపనిని కష్టతరముగా చేసికొనుట.
ధనంజయన్యాయము
  • కౌరవకులనాశమునకు మాలము కృష్ణుడే అయినా, ఆపేరు అర్జునునికి వచ్చినట్లు.
ధనుర్గుణన్యాయము
  • విల్లు వంకరగానుండునదియైనను విలుకాండ్రు దానికే అల్లెత్రాడు దగిలించి బాణప్రయోగ మొనర్తురు.
ధర్మాధర్మాత్మకన్యాయము
  • ప్రపంచములో ధర్మాధర్మములు రెండు నుండును.
ధాన్యపలాలన్యాయము
  • కళ్ళమునుండి మొట్టమొదట ధాన్యమే జాగ్రత్తగ ఇంటికి జేర్చి దంపి బియ్యమును గ్రహించి ఊక మొదలగునవి త్యజించివైచునట్లు.