పుట:SamskrutaNayamulu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

సంస్కృతన్యాయములు

దీపకలికాన్యాయము
  • చిన్నదీపము చీకటి అంతయు మ్రింగివైచినట్లు.
దుర్జనగర్దభన్యాయము
  • దుర్జనునకు గాడిదకు భేదము లేదు.
  • గాడిద ఎంతకొట్టినను తనస్వభావమును విడువదు; మంచి చోటును దొర్లి పాడుచేయును. దుర్జనుడును అంతే. సజ్జనుల యశమును పాడుచేయును.
దుర్జనమశకన్యాయము
  • దుర్జనుడు దోమను బోలినవాడు.
  • "కానరాకడాగ; రానీక చెంతకు
  • దోలి తోలి కొట్ట; గూలనడచ
  • సందు లెమకి యెటులొ సాధించు బాధించు
  • దోమ యౌర! తులువ రామకృష్ణ!" - వ్యాఖ్యాతల రామకృష్ణశతకమునుండి.
దూరగిరిన్యాయము
  • దూరపుకొండలు నునుపు. దగ్గఱకు బోయిన జెట్టులు గుట్టలును.
దూర్వామూలన్యాయము
  • గరిక వేరు భూమిలో నుండి యుండి చినుకు పడగానే చిగుర్చును. కాని యెన్నటికిని జావదు.