పుట:SamskrutaNayamulu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

సంస్కృతన్యాయములు

దండాపూపన్యాయము
  • బూరెలమూట కట్టిన కఱ్ఱను ఎలుక కొఱికినదన, బూరెలు కూడా కొఱికి తినినదని వేఱె చెప్పవలెనా?
  • (ఇది ఇంచుమించు కైముత్యన్యాయమును బోలును.)
దండాభావన్యాయము
  • కఱ్ఱలేనివానిగొఱ్ఱె కఱచినరీతి.
దగ్ధపటన్యాయము
  • మడతబెట్టిన బట్ట కాలిపోయినపుడు మడతలు మడతలు గాను, పోగులయల్లిక యల్లికగాను కాన్పించును. కాని చేతులతో ముట్టిన విడిపోవును.
  • (యధార్థము నెఱింగినవెనువెంటన భ్రాన్తి దూరమవును.) చెన్న బ. 3.39].
దగ్ధపదమార్జాలన్యాయము
  • నలుగురు దూదివర్తకులు ఒకపిల్లిని తెచ్చి దానినాలుగు కాళ్ళకు నలుగురును గజ్జెలుకట్టి పెంచుచుండ దాని కొక కాలికి దెబ్బ తగిలెను. ఆకాలుగలవాడు ఆగాయమును మాన్పుటకై చమురుగుడ్డ లాకాలికి చుట్టెను. అది దీపము తగిలి యంటుకొనెను. అంతట నాపిల్లి బాధకు దాళ జాలక దూదిమూటలపై బరుగెత్తెను. దూదియంతయు దగులబడెను. తక్కిన మువ్వురు వర్తకులు ఆదూది దండుగ పిల్లికాలికి గుడ్డచుట్టినవా డీయవలసినదని ధర్మాధి