పుట:SamskrutaNayamulu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

35

సంస్కృతన్యాయములు

తృణజలూకాన్యాయము
  • గడ్డిపురుగునకు మూతిప్రక్కను రెండు కాళ్ళును, వెనుక ప్రక్క రెండుకాళ్ళు నుండును. అది వెనుకకాళ్ళతో నిలబడి ముందు నిలుచుట కాధారము చూచుకొని ముందఱికాళ్ళ నక్కడ బెట్టి పిదప వెనుక కాళ్ళు తీయును.
తృణరజ్జున్యాయము
  • గడ్డిపోచలు వెంటిగానేర్పడి మనగజమునైన బంధించును.
తృణాగ్నిన్యాయము
  • చితుకులనిప్పు (క్షణములో నశించును.)
తృణారణిమణిన్యాయము
  • గడ్డివలన గలిగిన నిప్పు గడ్డినిప్పు అవును; అరణియందు మధింపబడిననిప్పు పవిత్రమయిన హోమాగ్ని అవును. సూర్యకాంతమణియందు బుట్టినజ్వాల మణిజ్వాల అవును.
తేజస్తిమిరన్యాయము
  • వెలుతురున్న చోట చీకటి యుండదు.
దండచక్రన్యాయము
  • కుమ్మరిచేసే కుండకు వానిచేతిలోనికర్ర, సారె, నీళ్లు, మొదలగునవి కారణము లవును.
దండసర్పమారణన్యాయము
  • సర్పమును చంపుటకు కఱ్ఱ చాలి ఉండగా గొడ్డలితో బయలుదేరినట్లు.