పుట:SamskrutaNayamulu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

33

సంస్కృతన్యాయములు

తక్రకౌండిన్యన్యాయము
  • "బ్రాహ్మణుల కందఱకు బెరుగు వడ్డింపుడు. కౌండిన్యునకుమాత్రము చల్లపోయుడు" అని చెప్పినప్పుడు కౌండిన్యుడును బ్రాహ్మణుడే యగుటచే పెరుగు పోయవలసియున్నను ప్రత్యేకముగా పేర్కొనబడుటచే నాతనికి మజ్జిగయే వడ్డింతురు. అట్లే -- విశేషవిధులు సామాన్యవిధులను బాధించును.
తాలసర్పన్యాయము
  • తాడిచెట్టుపై ప్రాకుపాము ఇతరులు చంపవలసిన అవసరము లేకయే ఒడలు చీరుకుపోయి తనంతనతానే చచ్చును.
తాళాధిరోహణన్యాయము
  • తాడిచెట్టెక్కువాని నెందాక నెగగ్రోయుదురు ?
తిలతండులన్యాయము
  • నువ్వులు బియ్యము కలిసిన విడదీయుట సులభము.
  • నువ్వులు, బియ్యము కలిసిన నడుమ నడుమ నల్లగాను, తెల్లగాను నుండును.
  • "పుడమి తిలతండులన్యాయమున వెలుంగ." మనుచరిత్రము 2.7.
తీరబకన్యాయము
  • ఒడ్డున కొంగ జపముచేయుచున్నట్లే ఉండి చేప చేరువకు రాగానే మ్రింగును.