పుట:SamskrutaNayamulu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

31

సంస్కృతన్యాయములు

తంతున్యాయము
  • నూలుపోగులు అన్నీ ఒక చోట జేరి వస్త్రముగా దయారయినట్లు.
తత్ర్పఖ్యన్యాయము
  • "అగ్ని హూత్రమును వేల్చవలెను" అనిన "ఏమి వేల్చవలెను" అనుప్రశ్న రాగా "హవిస్సును" అని అగ్నిహూత్రశబ్దమువలననే తెలియుచున్నది.
తటాకపరివాహన్యాయము
  • చెఱువునీరు తూముగుండా కొంచెము విడువనియెడల గట్టు తెగి నీరంతయు పోవును.
తప్తతైలాంబున్యాయము
  • కాగిననూనెపై నీళ్ళు చల్లిన భగ్గున మండును.
తప్తపరశుగ్రహణన్యాయము
  • క్రమక్రమముగ వేడివస్తువులను పట్టుకొనుట అలవాటు చేసిన చివఱకు కాలుచూఉన్న ఇనుపగొడ్డలిని కూడ పట్టు కొనవచ్చును. (అభ్యాసం కూసువిద్య)
తప్తద్రాష్ట్రతిలన్యాయము
  • కాలినమూకుడులో నువ్వులు వేసినట్లు. ఆనూవులు వెంటనే ప్రేలి పై కెగురును. దుఃఖము ఆపుకోలేనివారును ఇంతే.