పుట:SamskrutaNayamulu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

సంస్కృతన్యాయములు

జహత్స్వార్ధావృత్తిన్యాయము
  • శబ్దము స్వార్థమును విడచి అన్యార్థమును బోధించుట.
  • (గంగలో గొల్లపల్లె అనిన గంగఒడ్డున గొల్లపల్లె అని అర్థము.)
జహదజహత్స్వార్థావృత్తిన్యాయము
  • తొలుత శబ్దమునకు వచింపబడిన అన్యార్థము, స్వాభావికముగ ఆశబ్దమునకు గలయర్థము ఒకటియే అని చెప్పుట, "వాడే వీడు" మాదిరి.
జాలమత్స్యన్యాయము
  • వలలో జిక్కిన చేప వలలో నుండి సర్వముం జూచు చుండును. కాని, బయటికి రానేఱదు.
టిట్టిభన్యాయము
  • సముద్రపుటొడ్డున పెట్టిన తనగ్రుడ్లను సముద్రుడు తరంగముల ద్వారా అపహరించుటచే కోపించి ఒకతిత్తిరిపక్షి ఱెక్కలు తడిపి ఆనీటిని వెలుపల విదలించియు, త్రాగి వేసియు సముద్రము నింకింపసాగెను. అందులకు సముద్రుడు భయపడి ఆపక్షిగ్రుడ్లను బహుమానపురస్సరముగ మఱల సమర్పించి ధన్యుడయ్యెను.
తండులభక్షణన్యాయము
  • వండుకో లేక బియ్యమే బొక్కినట్లు.