పుట:SamskrutaNayamulu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

29

సంస్కృతన్యాయములు

జలమౌక్తికన్యాయము

ముత్యపుచిప్పలోనినీరు ఒకప్పుడు ముత్యము లవును. సమయము వచ్చిన అల్పుడుగూడ దొడ్డవాఁ డవును.

జలాగ్నిన్యాయము

అగ్నియు జలమును కలియునప్పుడు వానిలో నేది తక్కువ యైన నది హరించిపోవును.

జలానయనన్యాయము

నీరుతెమ్మనిన, పాత్రలోఁ బోసికొని తెమ్ము అని వేఱె చెప్పవలెనా?

జలేతరంగబుద్బుదన్యాయము

తరంగములు, బుడగలు నీటిలోనే పుట్టి నీటిలోనే లీనమైనట్లు.

జలూకాన్యాయము

జలగను స్త్రీస్తనములపై వైచిన అది పాలను మాని రక్తమే పీల్చును. మక్షికాన్యాయమును చూడుము.

జలౌష్ణ్యన్యాయము

జలము స్వభావముగా శీతలమే అయినను కాగబెట్టినచో వేడినీరు అని వ్యవహరింపఁబడును. (దొంగతోదిరిగిన దొరకూడా దొంగగా భావించఁబడును)