పుట:SamskrutaNayamulu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

27

సంస్కృతన్యాయములు

జంబుకారగ్వధన్యాయము
  • నక్క రేలకాయలు తిని కడుపునొప్పి యెత్తినందున, ఇక నెన్నడు రేలకాయల దినరా దనుకొని కడుపునొప్పి పోగానే మఱల రేలకాయల దినుటకై వెళ్ళినదట.
జతుకాష్ఠన్యాయము
  • లక్కపుల్ల యెక్కడ విఱిచిన నక్కడ విఱిగి మఱల నతికిన నతుకుకొని విఱిచిన విఱుగునట్లు.
జపాస్ఫటికన్యాయము
  • మంకెనపువ్వు స్ఫటికముచెంత నుంచిన స్ఫటికమంతయు నెఱ్ఱబడిపోవును.
జలచంద్రన్యాయము
  • చంద్రు డొకడే అయ్యు వేఱువేఱుపాత్రలలో ప్రతిబింబించి అనేకచంద్రులుగ భాసించును.
  • ఆత్మపదార్థమొక్కటియే. కాని అది శరీరశతాంతర్వర్తియై అనేకత్వమున భాసించును.
జలతరంగన్యాయము
  • నీరూ, కెరటములవలె.
  • గాలివలన నీరే కెరటములుగ మాఱును. కెరటములకును మాధుర్యత్వాదిజలధర్మము లన్నియు నుండును,
  • అట్లే అవ్యక్తనిగ్గుణపరబ్రహ్మము ప్రపంచరూపమున బరిణ మించినను ప్రపంచమునకు బ్రహ్మగుణధర్మములు సంక్రమించును.