పుట:SamskrutaNayamulu.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
366

సంస్కృతన్యాయములు

హనద్భి: క్రియతే కర్మ రుదద్భి రనుభూయతే

వవ్వుతూ మహాసంతోషము పొందుతూ ఉన్నవారలచే చేయబడుకర్మ ఏడ్చుచూఉన్నవారలచే అనుభమింపబడును.

'"పిల్లికి చెఱలాటం: ఎలుకకు ప్ర్రాణసంకటం" అన్నట్లు.

హోతారమషి జుహ్వానం స్పృష్టొ దహరి పావక;

ముట్టుకొనబడునెడల అగ్నిహోత్రము తనలో హోమము చేయువానిని గూడ దహించును.

క్షతే ప్రహారా నిపతం త్యభీక్ష్ణమ్ దెబ్బతగిలిన చోటుననే ఎక్కువగ దెబ్బలు తగులుచు ఉండును.

క్షతే మక్షికాపాత:

పుండుమీద ఈగ వ్రాలినట్లు

అట్లు వ్రాలిన ఈగ తొలిచి తొలిచి పుందును పెద్దది చేయుచు తోలినను పోక వేధించును.

క్షేతం విహాయారోచకగ్రస్త: సౌవీరరుచి మనుభవతి

నోరు చవిచెడిన రోగి పాలు త్రాగ నిచ్చలేక మాని, పుల్లరేగుపండ్ల రుచిని మాత్రమనుభవించును.