పుట:SamskrutaNayamulu.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
364

సంస్కృతన్యాయములు

క. భూమిన్ "సర్వం హస్తిప

దేమగ్న" మ్మనెడుమాడ్కి; దెలియగ దన్మా

యామగ్నము శివవిధిర

క్షోమరమాయావిధంబు నవనీబాధా."

విష్ణుమాయానాటకము ఆ.1. ప.44 (చింతలపూడి యెల్లనార్యుడు).

సామాన్యవిధి రస్పష్ట:

సర్వసామాన్యముగ నుడువబడినవిధి (General rule) అస్పష్టముగ నుండును.

"న హి సామాన్యవాచీ శబ్ధో విశేషా నభివతి" అను దానిం జూడుము.

సోపానత్కే పాదే ద్వితీయా ముపానహ మశక్యత్వా న్నోపాదత్తే చెప్పులు తొడిగి యున్న కాలూన్ మఱొకచెప్పును తొదుగుటశక్యము గాన అట్లు తొడుగుకొనరు.

"న హి సోపానత్కే పాదే పున రపి సోపానహ ముపాదత్తే" అనుదానిని జూడుము.

స్వభావో దురతిక్రమ:

స్వభావమును దాచుట చాలకష్టము.