పుట:SamskrutaNayamulu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

21

సంస్కృతన్యాయములు

గృహమార్జాలన్యాయము

పిల్లి యింటిని కనిపెట్టుకొని యుండినను దానికి గౌరవము లేదు. ( ఏనుఁగు బయటనున్నను దానికి గౌరవము కలదు.

గేహేశూరన్యాయము

ఇంటఁ గూర్చుండి డంబములు పలుకువాఁ డెందులకును కొఱగాడు. (ఉత్తరకుమార ప్రజ్ఞలు.)

గోపుచ్ఛన్యాయము

ఆవుతోక మొదట లావుగ నుండి క్రమముగ సన్నగిలి తుదను మొనదేలి యుండును.

గోబలీవర్దన్యాయము

గోశబ్దమునకు, ఆవులు ఎద్దులు గూడ నర్థము. బలీవర్దశబ్దమున కెద్దు లర్థము. గోబలీవర్ద మనునపుడు బలీవర్దశబ్ద మున్నందున గోశబ్దమునకు ఆవులే యర్థము చెప్పవలయుననుట.

గోమయపాయసీయన్యాయము

పేడ పరమాన్నమగునా? గోవువలన గలిగినదగుటఁ బాయసమును గోమయమన నవునా?

గోమహిష్యాదిన్యాయము

ఆవులూ పాలిచ్చును; బఱ్ఱెలు, గొఱ్ఱెలూ పాలిచ్చును.