పుట:SamskrutaNayamulu.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
363

సంస్కృతన్యాయములు

సర్వం బలవత: సధ్యం

బలఫద్యస్తువునకు సర్వము సరిఅప్డును. బలవ్ంతున కెద్దియైన జెల్లును. బల్హీనునకది ప్రత్యవాయ కరణ మవును.

పెద్ద పెద్ద మఱ్ఱిచెట్లు మున్నగుగానిని విఱచుట, తినుట మహాగజములకే చెల్లుబాటవును గాని అల్పజంతువులకు త్ప్రయత్నమే వినాశకారణ మవును.

సర్వనాశే సముత్పన్నే అర్ధం త్యజతి పండిత:

సర్వనాశము సంభవించినపుడు పండితు డైన వాడు సగము విడచివేయును. (తక్కిన సగముతో తనకార్యము సాధించుకొనును.)

అర్ధనాశే సముత్;పన్నే సర్వం త్యజతి దుర్మతి:--అనివేకి అయినవాడు సగమునకు నాశనము సంబవించిన;ఉడు పూర్తిగ నంతయు వదలివైచును.

సర్వశాఖాప్రత్యయ మేకం కర్మ వేదములందలి అన్ని శాఖలు నంగీకరిచునది ఒక (యాగారి)కర్మమే.

సర్వశాఖాప్రత్యయన్యాయమును జూడుము.

సర్వం పదం హస్తినదే నిమగ్నం హస్తిపదన్యాయమును జూడుము.