పుట:SamskrutaNayamulu.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
362

సంస్కృతన్యాయములు

నల్లనికలువ అని ప్రయోగించవలసిన అవసరమేమి? అట్లు ప్రయోగించిన దాని కర్ధమేముందును?

అదియే ఆనదగిరి యిట్లు నుడువుచున్నాడు-- "నీల ముత్పల మిత్యత్ర విశేషణవిశేష్యయో: సంభవేవిశేషణం వినా విశేష్యన్య వ్యభిచారే ప్రయుక్తే నీల మితి విశేషణ మర్ధన ద్దృష్టం."

సర్వం కార్యం సమారణం

ప్రతియొకకార్యము సకారణముగ నుందును. కారణము లేనిదే కార్యము కలుగదు.

సర్వం ఖలస్య చరితం మ్శక: కరోతి దుష్టుని పని అంతయు దోమ చేయును. దుర్జనమశకన్యాయమునుజూడుము.

సర్వం జ్ఞానం ధర్మిణ్యభ్ర్రాన్తం, ప్రకారే తు వ్యత్యయ:

సమానధర్మములు గల ధర్మియందు అవేధర్మములతో గలుగుజ్ఞానము అభ్రాంతజ్ఞానము అనగా భ్రమరహితమైన జ్ఞానమే అవును. ప్రకారే--అనగా--విధర్మియందు ధర్మిధర్మప్రవృత్తమైనజ్ఞానము భ్రాంతజ్ఞానము--భ్రమచే గలిగిన జ్ఞాన మవును.

రజతమందు రజతజ్ఞానము అబ్రాంతజ్ఞానము; రజతేతరమయిన శుక్తియందు రజతజ్ఞానము భ్రాంతజ్ఞాము.