పుట:SamskrutaNayamulu.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
357

సంస్కృతన్యాయములు

శిబికావహనము సరిగ నెఱవేఱదు.

అట్లే--పదము లన్నియు గలిసి వాక్యార్ధమును బోధించును. మోయు వారు సరిగ కలియకపోయిన పల్లకి నిష్ప్రయోజనమైంట్లే పదములు కలియక అసందర్భములైన వాక్యార్ధము సయిత మసంగతమే యయి దాని అర్ధమే చెడును.

శిరశ్చేద్ఫే పి శతం న దదాతి వింశతి పఇచా కంతు ప్రయచ్చతీతి శాకటికన్యాయ:

ఒకబండిలాగువాడు తల దీసినను నూఱు రూపాయలీయును, అయిదు ఇరవైలు ఇత్తు నని వాదించెనట.

ఉదా--ప్రపంచమునకు మిధ్యాత్వమును నడువను; అసత్త్వమును (అభావత్వమును) చెప్పెదను అన్నట్లు. పర్యాయపదమునే (అభ్యావత్వమును) చెప్పెదను అన్నట్లు. పర్యాయపదమునే గ్రహించి మూర్ఖత నవలంబించుచు హాస్యాస్పదుడవుట అని న్యాయాశయము.

శాకటికన్యాయము జూడుము.

శిలాఘనమధ్యస్థప్రదీపసహస్తప్రధనవత్

రత్నశిలామధ్యమున నుంచబడిన యొక పెద్దదీపము (ఱాతి పలకలలో ప్రతిఫలించి) కొన్నివేలదీపములుక భాసించునట్లు.

విజ్ఞానము అవభాసకాన్తర నిరపేక్షమై తానె అట్టు లవభాసించును