పుట:SamskrutaNayamulu.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
355

సంస్కృతన్యాయములు

శత్రో రపి గుణా వాచ్యా వాచ్యా దోషా గురో రపి

శశ్రువునైను వాని మంచిగుణములను చెప్పుకొనవలెను. గురువిషయమైనను (సంకోచింపక} దోషములను చెప్పవలెను.

సాన్తే కర్మణి వెతాలోదయ:

కర్మ పూర్తి అయినపిమ్మట వేతాలు దుదయించినట్లు. వచ్చిన అనర్ధమునకు ప్రతీకారమొనరించి దాని నివర్తింప జేయ దగిన శాంతికర్మ చేయ నారంభించి ముగించిన వెనువెంటనే భయంకరమైన ఆకారముతో వేతాలు డొకదు బయలుచేరినట్లు. దానివలన నారబ్ధకర్మమునకు వ్యాఘతము, స్వాభీష్తాపూర్తి సంభవించుచున్నది.

ఉదా--జీవేశ్వరాభేదమును సాధింప బ్రయత్రించి వారముచేయువాడు భేదశ్రుతి నుదాహరణముగ వైకొనినట్లు. (దానివలన వానివాదమంతయు ధ్వంసమై పోవుట యేగాక భేదత్వసిద్ధిరూపానార్ధము సయితము పొడముచున్నది.)

శాబ్ద్యాకాంక్షా శబ్దేనైన పూర్వతే

క్రియాసమబంధమైన ఆకాం శబ్ధముచేతనే పూరింపబడును.

శ్రామ్యే త్ప్రత్యపకారేణ నోపకారేణ దుర్జన:

దుర్మార్గుడు ప్రత్యపకారముచేతనే లొంగునుగాని ఉప కారముచే లొంగడు.