పుట:SamskrutaNayamulu.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
354

సంస్కృతన్యాయములు

వృద్ధి మిష్టవతో మూల మషి నష్టం

ఐదానికిని, దీనికిని "త్" మాత్రమే భేదము.

"లేనిదానికి ఆసపడగా ఉన్నదికూడా ఊడిందట" అని తెనుగుసామెత.

ఎక్కువవడ్డీకి ఆశపడగా అసలునకే భంగము వాటిల్లినట్లు.

వృశ్చికభియా పలాయమాన: ఆశీవిషముచే నివతిత:

తేలున్న దను భయముచే పరువెత్తుచు నొకడు పోయి పోయి కొండచిలువనోతిలో పడినాడట.

వృషభకలహే వత్సల్పాదభజ్గ:

ఆవులు, ఆవులు పోట్లాడి లేగలకాల్లు విఱుగ ద్రొక్కినట్లు.

"మగౠ, పెండ్లాము పోట్లాడి దేవతర్చన బ్రాఃమణునిపై బడినట్లు" అని తెనుగుసామెత.

వ్యపకవ్యావృత్త్యా వ్యాప్తవ్యావృత్తి:

వ్యాపకము పోయినప్;ఉడు వ్యప్యము సయితము పోవును. మేఘము పోయిన నీలాదిత్వాదులును పోవునట్లు.

"వ్యాపకాభావే వ్యాప్యం నాస్తి" అనియు దీనిని వాడుచుందురు.