ఈ పుట ఆమోదించబడ్డది
20
సంస్కృతన్యాయములు
- గర్ధభరోమగణనన్యాయము
గాడిదబొచ్చు లెక్క పెట్టుటవలన ప్రయోజనమేమి?
- గలేపాదుకాన్యాయము
ఎవడైన మెడలో చెప్పు కట్టుకొనునా? అసంబద్ధవర్ణనమని తాత్పర్యము.
- గుంజాగ్నిన్యాయము
గురువిందను జూచి నిప్పు అనుకొనినట్లు.
- గుడజిహ్వికాన్యాయము
బెల్లము నాలుకపై నున్నంతసేపే తీపి.
- గుడోపలన్యాయము
బెల్లముగొట్టిన ఱాయివలె.
- గురుశిష్యన్యాయము
యథార్థపుగురుశిష్యులు ఒకరినొకరు బాసియుండజాలరు. విధివశమున దూరంగతులైనను వారిమనస్సులుమాత్రమత్యంతసన్నికృష్టములై యుండును.
- గృహదీపికాన్యాయము
ఇంటిలో నొకచోట నున్నను దీప మిల్లంతయు ప్రకాశింపఁ జేయును.
- గృహబద్ధకుమారీన్యాయము
ఇంటిలోఁ గట్టిపెట్టఁబడిన కలబంద పెరుగనూ పెరుగదు, చావనూ చావదు.