పుట:SamskrutaNayamulu.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
352

సంస్కృతన్యాయములు

విపులకదలీఫలలిప్పయా జిహ్వాచ్చేదనం

చాల అరటిపండ్లయందలిలిప్సచే నాలుక తెగకోసికొనునట. పరమేశ్వరాభేదతృష్ణచే విష్ణువుయొక్క గుణోత్కర్ష ఎండమావులతో ల్సమానమైన దని నుడువుట - విపుల కదలీఫలలిప్సయా జిహ్వాచ్చేదనమును పొలియున్నది. ఇట్టి విష్ణివిద్వేషణమువలన అంఢతమనవారకప్రవేశము సంభవించును.

విలూననాసికస్యా దర్శదర్శనం

(కోపముచే నొడ లెఱుగక) ముక్కు క్జోసుకొనినవానికి అద్దము చూపుట.

పొడమినకినుక నేర్పుగా నుపశమింపజేయును దానివలన సంభవించు ననర్ధములను గమనింపజేయుచు సన్మార్గము నుపదేశించుఇట-- విలూననాసిక్జన్యా దర్శదర్శన మును బోలును. (మాఱువలుకుట కినిసినవానికి మఱింత కోపోద్దీపన కారణ మవును గాన యుక్తిచే దానిని నివారించుట మేలు)

విషకుంభం పయోముఖం

మూతిదగ్గఱ చుట్టు మాత్రము పాలచే పూయబడి ఉన్న విషపుకుండ.

పైకి మంచిగా కనబడుట; లోపలమాత్రము విషము.

"పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం

వర్జయే త్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖమ్"