పుట:SamskrutaNayamulu.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
351

సంస్కృతన్యాయములు

వర మధ్య కపోత: శ్వో మయరాత్

రేపో ఎల్లుందియో లభించు నెమలికంటె ఈనాడు (లభించిన) పావురమే లెస్స.

వరాబకాంవేషణే ప్రవృత్త శ్చింతామణిం లబ్ధివాన్

గవ్వను వెతుకబూనినవానికి చింతామణి దొఱకినట్లు.

వాచ" కర్మాతిరిచ్యతే వాక్కుకంటె క్రియ శ్రేష్ఠము

అందువలనే సత్పురుషులు నోటితో అనక కార్యారూపమున జూపుదురు.

విక్రీతగవీరక్షణం

అమ్మివేసిన ఆవును మఱల తానే పోషించుటల్.

తనఆవునొకరి కమ్మివైచన పిమ్మట కొనినవాడు క్రయధనమంతయు నీయనియేడల విక్తేత ఆఆవును వారికి స్వాధీనము చేయక తన దొడ్డియందే యుంచి మామూలుగ తన ఆవుమాదిరిగానే పెంచుకొనుచున్నను అది వివాదస్థానమగును. ఎందువలననన అది అమ్మివేయబడిన ఆవు అని పేరు పొందును. వాడు డబ్బు యిచ్చెనా? లేదా? అని విచారించువా రుండరు. నీవు అమ్మితివా? లేదా? అనియే ప్రశ్నింతురు.

విక్రీతా కరిణి కి మంకుశాయ వివాద:

ఏనుగును అమ్ముకొనిన తరువాత అంకుశము కొఱకు తగాదా యెందులకు?