పుట:SamskrutaNayamulu.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
350

సంస్కృతన్యాయములు

ప్రహ్లాదునిపై చాల కినిస్ సభలో హిరణ్యకశిపుడు తన భటులతో నిట్లనెను--

"వధ్యతాం వధ్యతాం బాలో నానేనా గ్దో స్తి జీవతా, స్వపక్షహానికర్తృత్వాద్య: కులాంగారతాం గత:."

స్వపక్షమునకు కీడు మూడించుచుకులమునకు ధూమకేతువువలెజనించిన యీతడు బ్రతికియుండి యేమి ప్రయోజము? తీసికొనిపోయి చంపివేయుడు.

కాని "విషవృక్షొపి సంవర్ద్య స్యయం చేత్ల్తు మసాంప్రతమ్" అను వాక్యమున కియ్యది విరుద్ధము కాదా? ప్రపంచములో నెచటనైనకడువునం గన్నవానిని తండ్రి సమయింపజేయునా? యనిన "త్యజే దేకం కులస్యా ర్ధే" యను న్యాయమున నియ్యది యుక్తమే యని సిద్ధాంతముచేయుచు విజ్ఞలు పై "వధ్యతాం వధ్యతాం బాల" అను వాక్యమును న్యాయముగ ప్రయోగంచియుండిరి.

వరం సాంశయికా న్నిష్కా దసాంశయిక: కౌర్షావణ:

అనుమానమైన నవరసుకంటె అనుమానములేని రూపాయి శ్రేష్ఠము.

అనుమానమైన నవరసుకంటె అనుమానములేని రూపాయి శ్రేష్ఠము.

ఇది సంస్కృతలోకోక్తి కాని న్యాయముగ వాడబడుచున్నది. దీనికి సామెత ఆంగ్లమున నొండుగలదు.

"A bird in the hand is worth two in the bush."