పుట:SamskrutaNayamulu.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
349

సంస్కృతన్యాయములు

దానిలక్షణములను, ఆతరువాత ఆలక్షణములు ప్రత్యక్షములుగ ప్రమాణమును కావలసియుండును.

అట్లే--పృధివిని 'గన్ధవతీ పృధివీ" అని దంధవత్త్వలక్షణమును, అగంధవత్త్వము మనకు ప్రత్యేక్షముగ ననుభవములో నుండుటను, బట్టి మనము తెలిసికొనుచున్నాము. పమేశ్వరుని భక్తులు సర్గాది హేతుత్వరూపేశ్వరలక్షణము. శ్రుతిప్రమాణములవలన తెలిసికొనుచున్నారు.

లక్షణాశ్రయా లక్ష్యస్య వ్యవస్థా

లక్ష్యనిశ్చయము లక్షణము ననుసరించియుండును. లాంగలం జీవనం

"నాగలి జీవనము" అన్నట్లు జీవనమునకు నాగలి నిమిత్తము అని అర్ధము.

"ఆయుర్ఘృతం; విషం మృత్యు:" ఇత్యాదులవలె. వచనే కో దరిద్ర:

మాటలో దరిద్రు డెవడు?

మాటలకు మాత్రము బీదతనము లేదని భావము.

"మాటలు కోటలు దాటును"

వధ్యతాం వధ్యతాం బాల:

ఇది విష్ణుపురాణమునందలి వాక్యము.