పుట:SamskrutaNayamulu.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
345

సంస్కృతన్యాయములు

మనసార మాటాడని వారికి మనోదూరము లయిన సమాధానములే తగినవి.

మూర్ఖునికి మూర్ఖతయే ప్రతిక్రియ.

యా యస్యాభిమతా తాత సురూపా తస్య సా భవేత్

ఎవని కేవతె ఇష్టురాలై ఉండునో వాని కాపె చాలసక్కనిది తోచును.

యావచ్చిర స్తావ చ్చిరోవ్యధా

తల ఉన్నంత వఱకే తలనొప్పి (తలలేకున్న తలనొప్పియే లేదు)

ముక్కు ఉందిననే పడిశము.

యావత్తైలం తావ ద్వ్యాభ్యానం

చమురున్నంతవఱకేదీపము, వ్యుత్పత్తిఉన్నవఱకే వ్యాఖ్య. తఱచిన కొలది క్రొత్తక్రొత్తయంశములు స్ఫురించుచునే యుందును.

యావత్స్నానం తావ త్పుణ్యమ్ స్నానము చేసినతదనుక తీర్ధములు పుణ్యఫలము నిచ్చుచునే ఉండును.

యావద్యచనం వాచనికమ్ వాక్య మెంత యుండునో అంతయే అర్ధము కావింపవలయును. గాని విశేషములు అనుబంధములు కల్పించుట తగదు.