పుట:SamskrutaNayamulu.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
344

సంస్కృతన్యాయములు

యాదృశ: పురుషస్యాత్మా తాదృశం సంప్రబాషతే

మనస్సు ఎట్టిదో వాక్కులుకూడ అటువంటివే పలుకుదురు.

యాదృశం ముఖం తాదృశీ దపేటికా

ముఖమును బట్తియే చెంపకాయ

"........మొత్తనిచెప్పుతోకొట్టుము" అనిసామెత. యాదృశీ భావనా తాదృశీ సద్ది:

ఎవని భావన (ఊహ} ఎట్లుండ్లునో ఫలితముకూడ నట్తిదియే కలుగును.

యాదృశీ మాతా తాదృశీ పుత్రీ

తల్లి యెట్టిదో కూరుగు నట్తిదీ.

"ఆవు చేనిలో మేసిన దూడ గట్టున మేయునా?"

యాదృశీ శీతలా దేవీ తాదృశం ఖరవాహవం

శీతలాదేవికి తగినట్లే గాడిదవాహనముగూడ నియోగింపబడినది.

యాదృశో యక్ష స్తాదృశో బలి:

యక్షు డెట్టివాడో అట్టిదే బలియు.

"యక్షాను కూలో బలి:" అనిన్యాయము.