పుట:SamskrutaNayamulu.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
337

సంస్కృతన్యాయములు

మృతం దుఱ్ఱుచ మాసాద్య కాకో పి గరుడాయతే

చచ్చి వరుగైన పామును బట్టి కాకి గూడ గరుడపక్షితో సమానమే అవును.

మౌన మర్ధాజ్గీకృతి:

చెప్పినదానికి మారుమాటాడక మౌనము వహించుట పూర్వపక్షిప్రతిపాదితార్ధము నంగీకరించుటయే. "అనిషిద్ద మనుమతం"ను జూడుము.

య ఏవ కరోతి న ఏవ భుంక్తే

"య ఏవ కర్మణ: కర్తానఏవతత్ఫలస్తూ భోక్తా" అవడు కర్మము చేయునో వాడే తత్ఫలము ననుభవించును.

య: కారయతి న కరోత్యేవ

ఎవడు చేయించునో వాడు చేయునుకూడ. ఎవడు అనుభవింపజేయునో వాడు అనుభవించును గూడ.

"జీవ స్తాప త్పిబ తీశ్వరస్తు పాయయతి | పాయయన్నపి పిబతీశ్వర: సాచయితర్యపి పక్తృత్వప్రసిత్థి దర్శనాత్:"

య త్కరధస్య వృషే న మాతి త త్కణ్ణే నిబధ్యతే

ఒంటెవీపుపై జాగా లేనియెడల (మిగతా సామానును) దానిమెడలో వ్రేలాడదీయుదురు.