పుట:SamskrutaNayamulu.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
334

సంస్కృతన్యాయములు

మానాదీనా మేయసిద్ధి:

మానమునుబట్టి మేయము సిద్ధించును.

లక్షణమునుబట్తి లక్ష్యము సిద్దించును.

దీనినే--"ప్రమాఘాధీనా ప్రమేయసితి" అందురు. మారణాయ గృహీతోజ్గచేచం స్వీకరోతి

చంపివేయుటకు గొనిపోబడినవాడు చంపివేయబడక యేదేని యొక అవయవమును ఖండించి వదలివేయుదుమనిన చావుతప్పి తిరిగి తనను బ్రతికినవానినిగా తలంచుచు అవద్యి మీయకొనును.

నరకయాతనలనుండి విడచి మనుష్యదు:ంఅములం బడక వైచిన నీకొననివా డుండునా?

"మరణా ద్వరం వ్యాధి:" అన్నట్లు.

అధికక్లేశ మనుభవించువానికి స్వల్పక్లేశానుభవమునకు బ్రేరితుడవుట ప్రమోదకరణమేయని వ్యాయాశయము.

మార్జాలాద్యర్జానం

పిల్లికి నూనెతో తల అంటినట్లు.

మాలతీగన్ధగుణవి ద్దర్భే న రమతే హ్యలి:

మాలతీపుష్పపరిమళ మెఱింగిన తుమ్మెద ఱెల్లుమదు సంతోషము నొందదు.(మనసైన కీయదు)

బ్రహ్మానంద మనుభవింప నేర్చిన జ్ఞాని తుచ్చవిషయానంద మపేక్షింపడు