పుట:SamskrutaNayamulu.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
329

సంస్కృతన్యాయములు

బహునా మ ప్యసరాణాం నమవాయో హి దుర్జయ:

దుర్బలులే యైనను పలువు రొకటిగా నున్న వారిని జయించుట దుర్టటము.

బాలస్య ప్రదీపకలికాక్రీదయైన నగరదాహ:

దీపపుతిల్లికతో నాడుకొను బాలుని ఆటయే పట్టణమును దహింపజేయ కారణ మవును. (అదిమాత్రము వానికి ఆటగానే యుండును. కాని పట్టణ;ఉగతి?)

బుభుక్షిత: కిం ద్వికర; ప్రభుం క్తే:

ఆకలి అయినది కదా అని ఆకలిగొన్నవాడు రెండు చేతులతోను తినునా?

బుభుక్షితస్య కిం నిమిస్త్రణాగ్రహ ఉత్కణ్ణితస్య కేకారవశ్రావణం

ఆకలిగొనిన వానికి పిలువలేదనే పట్టుదల; ఉత్కంఠితు డైనవానికి నమెలికూతలను వినిపించుట అడ్డుపడునా?

అధికృతతీర్ధాధికారులవు తపస్యులకు రాజనిర్బంధ మక్కడిది?

భక్షితేపి లశునే న శాన్తో వ్యాధి:

ఆశపడి వెల్లుల్లి తినినను వ్యాధిమాత్రము తగ్గలేదట.

"కృతే పి కేశసంస్కారే భార్యాత్వం నైవ ముంచతి" అన్నట్లు.