పుట:SamskrutaNayamulu.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
327

సంస్కృతన్యాయములు

చూడుము--- న హి విధిశతేనా సి తధా పురుష: ప్రవర్తితే యధా లోబేన.

ప్రసక్తం హి ప్రతిషిధ్యతే

ప్రసద్యప్రతిషేధన్యాయము నియ్యదియు నొకటియే.

ప్రసక్తమైనది అనగా---సందర్బవశౌన నారోపింపబడినయంశము మఱల నిషేథింపబడును. అనగా--ఆరోపితప్రసంగము దూరము చేయబడును. ఎట్లన-రూపరహితమైన వాయువునందు రూపారోపణ మొనరించి మఱల న ఞా చే నయ్యది నిషేధింపబడుచున్నది.

ప్రసజ్యప్రతిషేధన్యాయము

ప్రసజ్య--ప్రసక్తీని సంపాదించి (విరూపమును) ఆరోపించి తిరిగి దానిని నిషేధించుట.

పై--ప్రసక్తంహి ప్రతిపీధ్యతే--న్యాయము చూడు;ము. ఫలవత్సన్నిదా వఫలం తదంగం

ఫలవంతమైన క్రియకుముంగల తదంగమంతయు ఫల శూన్యమేయవును.

బంధనభ్రష్ణో గృహకపోత: చిల్లాయా ముధే పపాత

ఇంట నిర్భంధముగ బెంచబదుచు ఎట్లో బంధనమునుండి తప్పించుకొనిపోవుచున్న పెంపుడుపావురము పై కెగురగనే డేగనోటిలో పడె నంట.

ఒకకష్టము తప్పించుకొనిన వెనువెంటన అంతకన్న దుస్సహమైన కష్టము ప్రాప్తించుటయని న్యాయశయము.