పుట:SamskrutaNayamulu.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
317

సంస్కృతన్యాయములు

పర్తనే విద్యమానే పి గ్రామే రత్నపరీక్షా

దాపుననే పట్టణ ముండగా నొక విలువగల రత్నమును పరీక్షింప ఊరు పేరు లేని పల్లెకు తీసికొని పోయినట్లు

పరతంత్రం బహి ర్మన: బాహ్యవ్యాపారమందు మనస్సు పరతంత్రము (స్వతంత్ర్యములేనిది) అవును

బాహ్యవ్యాపరమందు మనస్సునకు ప్రసరణము లేదు అని అర్ధము.

ఎట్లన--శుక్తిజతజ్ఞానము మానసికమా? లేక ఐంద్రియకమా? అనిన బహి:పదార్ధములయందు మనస్సునకు వ్యాపారము లేదు కావున ఆశుక్తిరజతజ్ఞానము చక్షురింద్రియజనితమే కాని మానసికము కాదని సిద్ధాంతీక్జరింపబడినది.

పరస్పరవిరోధే హె న ప్రకరా న్తరస్థితి:

రెండు వాక్యములకు పరస్పరవిరోధము సంభవించినపుడు తదన్యప్రకారస్థితి యుండదు. (తదన్యతరస్థితిమాత్రము సంభవించును.)

పరస్పరవిరుద్ధములుగ నడువబడిన వాక్యముల కెన్నడును ఐక్యము కుదరదు. వానివలన విశిష్టరూప మింకోడు ఘటించును అని భావము.