పుట:SamskrutaNayamulu.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
304

సంస్కృతన్యాయములు

న హి భిక్షుక్తాసరం యాచితు మర్హతి సద్వస్వప్యే న్నభిక్షుకే

భిక్షుకుడు కాని ధనవంతుడు ప్రక్కనుండగా భిక్షుకుడు భిక్షుకుని యాచించడు.(ధనవంతుని యాచించును.)

న హి భూమా మభోరుహం సదితి దుష్టాక్షస్యాసి నభసి తదవ భానతే

నేలపై నున్న తమరకమలము కంటిజబ్బుగలవానికి ఆకాశముమీద నున్నట్లు కనుపించునుగాక, అది నేలపైననే యుందును.

న హి మరుమరీచితసరోమ్చు: క్రక: శుష్యతి

ఎండమావులనుసరసులోనీరు క్రమక్రమముగ నింకిపోదు. ఎండ పోయిన మఱునిముసముననే అంతయు మాయమవును.

న హి మోహయతి ప్రాజ్ఞం లక్ష్మీ ర్మరుమరీచికా ఎండమావివంటి లక్ష్మి ప్రాజ్ఞలను మోహపెట్టనేఱదు.

న హి య ద్దేవదత్తస్య య;ల్ద్యమానస్య స్థాన మదగతం తదేవ భుంజానస్యా పి భవతి

దేవదత్తుడు యుద్ధము చేయుచుండగా తెలిసికొనబడిన వానిన్ధానమే ఆతడు భుజించుచుండు నపుడునుగాదు.

దేవదత్తుడు యుద్ధము చేయు;చుండునపు డుండుస్థానము వేఱు; భుజించునప్పటి స్థానము వేఱు; భుజించునప్పటి స్థానము వేఱు; మఱొక పని ఛేయు