పుట:SamskrutaNayamulu.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
302

సంస్కృతన్యాయములు

న హి పూర్వబో మూఢ ఆసీ ది త్యత్మనోపి మూధేనైవ భతితవ్య మితి కించి చస్తి ప్రమాణం

"యేనా స్య పితరో యాతా యేవయాతా: వితామహాతే: యాయా త్సాతాం మార్గం తేన గచ్చన్ న రివ్యతే" తనపిట్రుపితామహు లేయే మర్గముల నేయేరీతి ననుసరించి యేట్లుండిరో ఆమార్గముల నట్లే వర్తించు మనుజుడు క్షేమము నొందును. అట్లే నడువవలయునుగూడ అనుమనుస్మృతిశ్లోకమున కసార్థము కల్పించి దయా నందుని పూర్వపక్షమువలె--నాపూర్వుడొకడు మూఢుడైయుండెను గాన నేనుగూడ మూఢుడనేయై యుండవలెనను ప్రమాణ మందును లేదు.

న హి ప్రతిజ్ఞామాత్రేణర్ధసిచ్చి:

ప్రతిజ్ఞ చేసినంతమాత్రమున కార్ల్యము నెఱవేఱును.

"ఏకాకినీ ప్రతిజ్ఞా హి ప్రతిజ్ఞాతం న సాధయేత్"ను చూడుము.

న హి ప్రత్యక్షవిరుద్దం శాస్త్రసహస్రేణాపి బోద్ధుం శక్యం

కంటి కగపడని విషయమును వేయిశాస్త్రములచే నైనను బోధించుట శక్యముగదు.

న హి ప్రమాణం జంతూడా ముత్తరక్షణజీవనే

మౠక్షణమందు జీవములు జీవించియుండగలవని ప్రమాణమెందునులేదు.

"జారస్య మరణం ధ్రువమ్" అని ఆచర్యోక్తి.