పుట:SamskrutaNayamulu.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
300

సంస్కృతన్యాయములు

"న హి కరకంకణదర్శనాయాదర్శపేక్షా" అను దానిని జూడుము.

న హి ధీమతాం కశ్చి దవిషయో నామ

బుద్ధిమంతుల బుద్ధికి గోచరముకాని యంశమేలేదు.

న హి నారికేలద్వీపవాసినో, ప్రసిద్ధగోశ్రకుదా త్కకుదాచిమదర్ఘ ప్రతిపత్తి ర్భవతి

ఎచటనో వారికేలద్వీపమున అప్రసిద్ధమైన నొక యెద్దుకలదని వినినపుడు దానికి మూపురము, గంగడోలు యింతింత యున్నవి; యింత అందముగ నున్నవి అను విచారణయే యుండదు.

నారికేల ద్వీపమున గోజాతియే లేదు అట్టిదానిం గూర్చి "అట, అట" అని చివరచేర్చుచు వృధాలోచన మొనరింపబడదు.

న హి న్ధా నిస్ట్యం నిన్బితుం ప్రయజ్వతే కిం తర్హి నిన్దితాదితర త్ప్రశంసితుమ్?

నింద నింద్యమైనదానిని నిందించుటకు మాత్రమే ప్రవర్తింపద్యు; అనింద్యమై ప్రకృతమిదితేతరమవు వస్తునును ప్రశంసిందుటకుగూడ నుపకరించును.

నింద్యమును నిందించుట లోకస్వభావమే కాని, ఆనింద యెన్నాడు నిందింప దగని వస్తులయందు నింద సూచించుచు అభిమతార్ధ శ్రేష్ఠప్రతిపాదనకు గూడ ఉపయోగింపబడును.