పుట:SamskrutaNayamulu.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
299

సంస్కృతన్యాయములు

"ఏకదేశకృత మన్న్యవత్; చిన్నపుచ్చస్వదృష్టాన్త:నహి కేవలభోజీ దేవదత్తో న్యై:సహ పంక్త్యాంభుంజానో న్యత్వం ప్రషద్యతే; శ్వాకర్ణేవా పుచ్చేవా చిన్నే శ్వైవభవతి నాశ్వోనగర్ధభ:" ఇత్యాదులు జూడుము.

న హి గ్రామస్థ: కదా గ్రామం ప్రప్నుయా మి త్యరణ్యస్థ ఇవా శాస్తే

గ్రామములో నున్నవాడు అరణ్యములో నున్నవానివలె ఎన్నడు గ్రామమును జేరుదునా అని కోరుచుండడు.

న హి త్రిపుత్త్రో ద్విపుత్త్ర ఇతి కధ్యతే

ముగ్గురు కుమారులు గలవాడు ఇరువురు కుమారులు గలవాడుగా నడువబడడు.

"చాదేగ్ఘే ద్వ్యుపసర్గస్య 6-4-96" అను పాణినిసూత్రమున పైన్యాయము ననుసరించి "అద్విప్రభృత్యుపసర్గస్య" అని వ్యాఖ్యానము కావింపబడినది.

న హి దీపా పరస్పర మువకురుత:

రెండు దీపములు పరస్పర ముపకారకరములు కావు. వెలుతురు నిచ్చుటకు ఒకదీపమునకు మఱొకదీపపు టవసరమే శూన్యము.

న హె దృష్టే. మవవన్నం

కంటికి కనబడుచున్నదాని విషయమై ఉన్నది లేదు అని ప్రమాణ వాక్యములు, వాదనలు నెందులకు?