పుట:SamskrutaNayamulu.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
279

సంస్కృతన్యాయములు

"యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయామీ, యస్యాం జాగ్రతి భూరాని సా నిశా పశ్యతో మునే;" భగవద్గీత --2--69

అట్లే సర్వబూతములకు రాత్రి మహాయోగికి పగలును; మహాయోగిమి రాత్రి సర్వభూతములకు పగలును అవును.

"కాకోలూకనిశేవాయం సంసారో జ్ఞాత్మవేదినో; యానిశా సర్వభూతానా మిత్వవోచ త్స్యయం హరి:" సురేశ్వరవార్తికము

దీనిపై నానందగిరివ్యాక్య యటు లున్నది--

"కాకెతి--యూఅకాకాదీకాం ప్రసిద్ధా నిశా తస్యాములూకో జగర్తీతి తద్దృష్ట్యా సాపలిప్యతే | యదాచకాకదయో జాగ్రతితదానక్తందృశో నిశేతి కాకాది దృష్ట్యా సాపహ్నూయతే హధేత్యర్ధ: | ఏవ మజ్ఞస్యాయం మాత్రాది; సంసారో యదా వివర్తతే తదా తద్ధృష్ట్యా తత్త్వస్యాపత్కల్పనా | యధా విదుష స్తత్త్వానుభవస్తదా తద్దృష్ట్యా మాత్రాదే రస త్త్వమితి:"

కాచి న్నిషాదీ తనయం ప్రసూతే కశ్చి న్నిషాదస్తు కషాయసాయీ

ఒక విషాదాంగన కుమారుని కనగా నొక నిషాదుడు తాను కషాయము త్రాగినాడట.

చూడుము. "అన్యద్భుక్త మన్యద్వాంతం"