పుట:SamskrutaNayamulu.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
277

సంస్కృతన్యాయములు

ఒక అనర్ధమును తప్పించుకొనిన మఱొక అనర్ధము పైబడినట్లు అని న్యాయలౌకికప్రవృత్తి.

ఏకో పి హంతి గుణలక్ష మసీహ దోష:

లక్షసద్గుణములను ఒక దోషము తిడిచివేయును.

నూఱు ప్రతములు ఒకఱంకుతో పోయినట్లు అని తెనుఘు సామెత.

కడవెడు పాలు ఒకవిషబిందువుతో పాడయినట్లు.

ఏకోహి దోషో గుణసన్నిపాతే నిమజ్జతీన్ధో: కిరణేష్వివాజ్క:

సుగుణములు కుప్పలు కుప్పలుగా నున్నపుడు ఒకదోషమున్నను అది వానిలో మునిగి కలసిపోవును గాని వస్తువునకు కళంకము తెచ్చిపెట్టనేఱదు.

ఉదా---సుధాకరుని కిరణములయందు నల్లనిమచ్చ.

అనంతరత్నప్రభవస్య యస్య హిమం న సౌభాగ్యవిలోపి జాతం, ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్జతీందో: కిరణే ష్వివాంక:" కుమారసంభవము.

కతకగవోదాహరణం

కొట్టములొ కట్తివేయబడిన ఆవువలె.

కొట్తములో కట్తివేయబదిన ఆవు పరుగెత్తుచున్న తోడి పశు;వులతోపాటు కాలిపలుపుతో సహా పారిపొవును.