పుట:SamskrutaNayamulu.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
269

సంస్కృతన్యాయములు

ఆంరే ఫలార్ధే నిమిత్తే చాయా గన్ద ఇత్యనూత్పద్యేతే

ఫలములనిమిత్తము నాటబడిన తీయమామిడిచెట్తువలన పరిమళము, నీడయు అడుగకయే లభించుచున్నవి. ఫలవత్సహకారన్యాయమును జూడుము.

ఆయుర్ఘృతం

నెయ్యి ఆయుర్ధాయము అనినట్లు

నెయ్యియే ఆయువు కానేఱదు, కాని, నేయిఆయ్య్వు అనిన నేయి ఆయువునకు నిమిత్తము అని అర్ధము నుడువబడుచున్నది.

"అయుర్ఘృతం ల్నదీ పుణ్యం భయం చౌర: సుఖం ప్రియా వైరం ద్యూతం గురు జ్ఞానం శ్రేయో బ్రాహ్మణ పూజనమ్"

ఇత్యాదు లెఱుంగునది

చూడుము---"దధిత్రపుసం ప్రత్యక్షో జ్వర:"

"అంతరేణాపి నిమిత్తశబ్దం నిమిత్తార్ధో గమ్యతే" అను న్యాయమున నిందు ఘృతాదులు నిమిత్తార్ధబోధము లవుచున్నది.

ఆర్డ్రం వస్త్రేం సమంతా ద్వాతానీతం రేణుజాగ ముపాదత్తే

తడిగుడ్డనలుమూలలనుండి వాయువుచే గొనిరాబడిన పరాగరేణువులను గ్రహించి తనపై నిలువజేయును.