పుట:SamskrutaNayamulu.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
268

సంస్కృతన్యాయములు

తాదృశార్ధావబోధకశక్తి ఆశబ్దముల కుండుటం జేసియే ఆ అర్ధము నడువబడును.

కామ్యాదికర్కానుష్ఠానమున దదనుష్ఠానమునకు శక్తుడావు నధికారియొక్క తచ్చ్క్తతాతక్తి తదనుష్ఠానమున దోడ్పడును. కాని, అనుష్టానమున కామ్యాదికర్మములు తోడుపడవు.

ఆత్మచ్చిద్రం న పశ్యన్తి పరచ్చిద్రానుసారిణ:

"తప్పులెన్నువారు తమతప్పు లెఱుగరు."

ఆదావస్తే చయనాస్తి వర్తమానేయపి చత్తధా

ఆదియందు, నంతమందు లేనిది వర్తమానమునందును అట్టి దియే (లేనిదే) అవును.

అంర్రన్ పృష్ట: కోవిదారా వచష్టే

మామిడిచెట్లున్నవా అని అడిగిన ఆ ఉన్నవవండి, కోవిదారచెట్లు అని చెప్పినట్లు.

వృచ్చకుని ప్రశ్నకు వలయు సమాధానమీక అజిజ్ఞాపితమై, ప్రసుతమైన వస్తువునుగుఱించి సమాధానముగ జెప్పనప్పు డీన్యాయము ప్రవర్తించును.

"పస లున్నవా అనిన చాల చక్కని మొదటినంబదు మినుము లున్నవండీ" అని షాహుకారు సమాధానము చెప్పునట్లు.