పుట:SamskrutaNayamulu.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
267

సంస్కృతన్యాయములు

అన్నేహదిపన్యాయము

చమురు లేని దీపము వలె.

క్రమక్రమముగ తనలో తాను లీనమై పోవుట నీన్యాయముసూచించును.

అహృయపచసా సుహృదయ ముత్తరం

హృదయపూర్వకములు గాని మాటలకు హృదయపూర్వకము గాని సమాధానమే యీయబడును.

"యాదృశో యక్ష స్తాదృశో బలి:"' యక్షు డెట్టివాడో అట్టిదే బలికూడ. "గంతకు తగిన బొంత" అని తెనుగుసామెత.

అజ్ఞాతకులశీలస్య వాసో దేయో కస్యచిత్

ఊరు, పేరు, కులము, శీలము తెలియని యితరపురుషునకెవరికిని యింటిలో నాశ్రయ మీగూడదు. (అట్లిచ్చుట ప్రమారము)

అభ్యాతానా మర్ధం బ్రువతాం శక్తి: సహకారిణీ

"అఖ్యాతానా మర్ధం బోధయతా మధికారిశక్తి: సహకారిణీ" అని మఱొకరకమునగూడ నీన్యాయము వాడబడును.

ఉద్దిష్టశబ్దముల కర్ధము నుడువునపు డాశబ్ధలసక్తి సహాయకారిణి యవును.