పుట:SamskrutaNayamulu.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
264

సంస్కృతన్యాయములు

ఆర్ధీ సమరో విద్యా నదిక్రియతే

అర్ధవంతుడు, సమర్దుడు విద్యాంసుడు అధికారము గల వాడవుచున్నాడు.

"శాస్త్రం హ్యనిశేష ప్రఫృత్తమపి మనుష్యానేవాదికరోతి శక్తత్వా దర్థిత్వా దపర్య్హుదస్తత్వా దుపన్యనాది శాస్త్రాచ్చేతి వర్ణిత మేత దధికారలక్షణే." శంకర భాష్యం.

అధికారన్యాయమును జూడు;ము.

అధికారన్యాయమున కాకనయాకర్మపవృత్తి సూచిత మవును. కాని, యిం దది లేదు; కేవల మొకానొక క్రియ కధికరము మాత్రమే సూచింపబడును.

అనతప్తే సకులస్థితం

వేడిప్రదేశమున ముంగిసలు నిలుకడవలె.

నెచ్చని చోట ముంగిస లుండక వెంటనే ఆవలకుపోవును.

"యధావతప్తే స్కులా న చిరం స్ధాతారో భవన్త్యేవం కార్యాణ్యారభ్య యోన చిరం తిష్ఠతి స ఉద్యతే వతప్తే నకులస్థితం త ఏత దితి." మహాభాష్యం.

తప్తస్థలమున సకులములు చాలకాల ముండనట్లే కార్యములను ప్రరంబించి పట్టుదలతో కాకృత్యములందు నిలుచక వెంటనే వదలివైచుటకు అవతస్తే నకులస్థతన్యాయోదాహరణమును గైకొందురు. తీర్ధకాకన్యాయమునలెనే.