పుట:SamskrutaNayamulu.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
257

సంస్కృతన్యాయములు

అన్యోన్యాశ్రయము గలిగి ఒకదానిచే నింకొకదానికి వ్య్యఘాతము కలిగినపు డీన్యాయము ప్రవర్తించును.

అనంతరన్య విధిర్వా భవతి ప్రతిషేదో వా

పదాంతరావ్యవహితమైన (మిక్కిలి సన్నిహితమైన) ప్రత్యయము (నఇక్ష్) విధిని బోధించవచును; ప్రతిషేధమును గూడ బోధించవచ్చును.

అనన్యలభ్య: శబ్ధార్ధ:

శబ్ధముయొక్క అర్ధము ఆశబ్ధమువలననే తెలిసికొనవలయును గాని మఱొక విధముగ తెలిసికొన బలనుపడదు.

"యావా నేవ హి అనన్యలభోర్ధ: శబ్ధా ద్గమ్యతే స సర్వ: శబ్ధార్ధ:" అని తంత్రవార్తికము.

మఱియొకసబ్దముచే నలభ్యమై యొకశబ్ధముచే పొందబడు నర్ధమంతయు ఆశబ్ధమునకే అర్ధమగుచున్నది.

అనగా---ఏఅర్ధమున బ్రయోగొంపబడు శబ్దము ఆ అర్ధమునకే వాచకమగును; ఆ అర్ధము ఆశబ్దముయొక్కయే వాచ్యమగును; ఆ అర్ధము ఆశబ్ధముయొక్కయే వాచ్యమగును.

ఉదా:-- సుఆఖవిసేషమున నుపయోగింపబడిన స్రర్గసబ్దము సుఖవిశేషావాచకమును; ఆసుఖవిశేషము ప్రయుజ్యమానస్వర్గశబ్దముయొక్క వాచ్యమును అవును.

"అనన్యలభ్య: శాస్త్రార్ధ్యక:" అనునట్లు.