పుట:SamskrutaNayamulu.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
247

సంస్కృతన్యాయములు

త్తస్త్యవాన్యస్యవా పుత్త్రాదయో భవన్తి, తేజన్మాంతరే తస్త్యవాన్యస్యవా కలత్రాదయ: శత్రుమిత్రాదయోవా భవ న్త్యతో నాయం నియమ ఇతి భావ: తమేవాభిప్రాయం ప్రకటయతి యధేతి-స్రోతన: ప్రవాహస్యవేదేన యధా వాలుకా: ప్రయాన్తి ప్రయజ్యన్తే సంయాన్తి సంయుజ్యన్తే తధా కాలవేగేన దేహినో జీవా అపి:

ప్రవాహవేగమున నిసుక యొకచో గూడి మఱల మఱల విడిపోవుచుండునటులే కాలవేగమున దేహధారు లొకచోగూడి యెవరిత్రోవన వారు విడిపోవుచుందురు.

క్షతే క్షారన్యాయము

పుండుమీద ఉప్పు పెట్టినట్లు. దుస్సహమని భావము.

"క్షతే క్షారమివాసహ్యం జాతం తస్యైవ దర్శనమ్"

క్షీరదగ్ధజిహ్యాన్యాయము

వేడివేడిపాలవలన గాలిన నాలుకవలె. సుఖమునకు పోగా దు:ఖము సంభవించినపు డీన్యాయము ప్రవర్తించును.

క్షీరాబ్ధివాసిక్షీరకామన్యాయము

పాలసముద్రములో నివసించువాడు పాలకోసము వెదకులాదినట్లు.