పుట:SamskrutaNayamulu.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
241

సంస్కృతన్యాయములు

రజానుసృతవివాహప్రవృత్తభృత్యన్యాయమునుజూడు;ము. అంతియగాక--తండ్రిచే ననుసరింపబడిన కుఱ్ఱవానివలె-- అని మఱొకపక్షము. ఎట్లన---

"అవొద్వదమిసారేణ వృత్తిద్బుద్ధస్య యుజ్యతే న్తనంధయానుసారేణ వర్తతే తత్సితాయత:. అధిక్షిప్త స్తాడితోవా బాలేన స్వపితా తదా నక్లిశ్నాతి నకుప్యేచ్చ బాలం ప్రత్యుత లాలయేత్ నిన్దత: స్తూయమానోవా విద్వానైజ్ఞర్న నిందతి నస్తౌతి కిన్తు తేషాం స్యా ద్యధా బోధ స్తధాచరేత్". బాలుడు తననుకొట్టినను, తిట్టినను తండ్రి కోపింపక వాని నుపలాలించును. అట్లే--అజ్ఞులు తనను దూషించినను, భూషింతినను వికారమును బొందక జ్ఞాని వారలకు రతురీతి జ్ఞానోపదేశము సేయును.

పర్తినిధిన్యాయము

ఒకరికి బదులుగా నుండువానికి, లేక నియమింపబడువానికి ప్రతినిధి యనిపేరు. వానివలె.

ఏదేని యొకవస్తువు లోపించినపుడుగాని, దొఱుకనపుడుగాని, త్ధ్సానమున మఱొకవస్తువును కల్పించుకొని ప్ర్రారబ్ధక్రియాపరిసమాపనమునకు గడంగుట యని యీన్యాయముయొక్క ఆశయము.